'గే' నుంచి రిక్వెస్ట్‌..బిగ్‌ హగ్‌ అంటూ హీరో రిప్లై | Harshvardhan Rane Reply to His Gay Fan Who Wants to See Him in Tamil Movies | Sakshi
Sakshi News home page

Harshvardhan Rane: 'గే' ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన హ్యాండ్‌సమ్‌ హీరో

Sep 25 2021 6:31 PM | Updated on Sep 25 2021 7:54 PM

Harshvardhan Rane Reply to His Gay Fan Who Wants to See Him in Tamil Movies - Sakshi

Harshvardhan Rane Reply To His Gay Fan:

Harshvardhan Rane Reply To His Gay Fan: హ్యాండ్‌సమ్‌ హీరో హర్షవర్దన్‌ రాణె ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించినా ప్రస్తుతం బాలీవుడ్‌ మీదే ఫోకస్‌ పెడుతున్నాడు. ఇటీవలె 'బిజోయ్ నంబియార్' అనే చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌గా అంతగా హిట్‌ అవ్వకపోయినా రాణె లుక్స్‌కి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అందుకే ఈ ఆరడుగుల అందగాడికి చాలామంది గర్ల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు.
చదవండి: అనుష్క పెళ్లిపై జ్యోతిష్కుడు ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే తాజాగా ఓ గే నుంచి రాణెకు రిక్వెస్ట్‌ వచ్చింది. 'నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. నేను స్వలింగ సంపర్కుడిని. దయచేసి మీరు తమిళ సినిమాల్లో నటించండి. నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను' అంటూ తమిళనాడుకు చెందిన నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి పోస్ట్‌ చేశారు. దీనికి హీరో రాణె స్పందిస్తూ.. గే అయినా, కాకపోయినా నా తరపున బిగ్‌ హగ్‌ అని, తనకు ధనుష్‌ సినిమాల్లోని పాటలంటే ఎంతో ఇష్టమంటూ రాణె రీట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

చదవండి:డిన్నర్‌ పార్టీలో ఎమోషనల్‌ అయిన నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement