breaking news
harsha vardhan rane
-
'గే' నుంచి రిక్వెస్ట్..బిగ్ హగ్ అంటూ హీరో రిప్లై
Harshvardhan Rane Reply To His Gay Fan: హ్యాండ్సమ్ హీరో హర్షవర్దన్ రాణె ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించినా ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవలె 'బిజోయ్ నంబియార్' అనే చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌గా అంతగా హిట్ అవ్వకపోయినా రాణె లుక్స్‌కి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అందుకే ఈ ఆరడుగుల అందగాడికి చాలామంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. చదవండి: అనుష్క పెళ్లిపై జ్యోతిష్కుడు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే తాజాగా ఓ గే నుంచి రాణెకు రిక్వెస్ట్ వచ్చింది. 'నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. నేను స్వలింగ సంపర్కుడిని. దయచేసి మీరు తమిళ సినిమాల్లో నటించండి. నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను' అంటూ తమిళనాడుకు చెందిన నవీన్‌కుమార్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. దీనికి హీరో రాణె స్పందిస్తూ.. గే అయినా, కాకపోయినా నా తరపున బిగ్ హగ్ అని, తనకు ధనుష్ సినిమాల్లోని పాటలంటే ఎంతో ఇష్టమంటూ రాణె రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి:డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున Gay or not gay, big hug bro! I love tamil songs from Dhanush sirs films! https://t.co/2L7AOvmk4Z — Harshvardhan Rane (@harsha_actor) September 24, 2021 -
నా కంటిపాప
సెలబ్రిటీలనగానే.. రంగుల లోకంలో విహరిస్తారనుకుంటారు. ఏ బాదరబందీ లేని వీరికి.. పక్కవాడి బాధ గురించి ఆలోచించే తీరిక ఉండదని నిష్టూరాలాడుతుంటారు. కానీ.. తమకూ మనసుందని సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. టాలీవుడ్ వర్ధమాన నటుడు హర్షవర్ధన్ రాణె ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి ఆలనాపాలన ఆన్నీ ఆయనే. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - ప్రజెంటేషన్: ఎస్.సత్యబాబు రెండేళ్ల క్రితం.. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని చీర్స్ ఫౌండేషన్ హోమ్‌కి వెళ్లినప్పుడు కలిసింది నాలుగేళ్ల స్వాతి. ఆ చిన్నారి తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట హెచ్ఐవీతో చనిపోయారు. అనాథలా మిగిలిన స్వాతి ఆ హోమ్‌లో ఆశ్రయం పొందుతోంది. అమాయకపు చూపులతో ఉన్న ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా బాధనిపించింది. పాప భవిష్యత్తు ఏమిటా అని హృదయం బరువెక్కింది. లాలనగా దగ్గరకు తీసుకుని పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే.. ‘డాక్టర్’ అని ముద్దుగా పలికింది. ఆ చిట్టితల్లి తన కల నిజం చేసుకోవడంలో తండ్రిలా తోడుండాలనిపించింది. హోమ్ నిర్వాహకుడు అశోక్ ని కలిసి స్వాతిని దత్తత తీసుకుంటానని, చదువుతో సహా తనకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పాను. గ్యారేజ్ సేల్.. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. కెరీర్ ఇంకా ప్రారంభంలోనే ఉంది. చారిటీ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన నాకు.. ఓ పాపను దత్తత తీసుకుందామనేంత ఉద్వేగం ఏమిటి ? ఏమో.. ఆ చిన్నారి అమాయకపు చూపులు నన్ను ఇవేమీ ఆలోచించనీయలేదు. మాటయితే ఇచ్చాను.. స్వాతికి సాయం చేయడమెలా..? అని ఆలోచించినప్పుడు.. ఓ విషయం గుర్తొచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్‌లో వాడని వస్తువులు, దుస్తులు, పుస్తకాలు.. పోగుచేసి కారు గ్యారేజ్‌లో పెట్టి విక్రయిస్తారు. ఆ సొమ్మును చారిటీకి స్తారు. దీన్ని గ్యారేజ్ సేల్ అంటారు. అదేరకంగా నేను కూడా తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్.. సినిమాల్లో వాడిన టీ షర్ట్‌లను షర్ట్ ఆఫ్ పేరుతో వేలం వేశాను. నాకు కారూ లేదు గ్యారేజ్ కూడా లేదు. అందుకని దుర్గం చెరవు దగ్గర ఫ్రెండ్ రాము నిర్వహిస్తున్న ప్రొటెన్స్ జిమ్‌నే గ్యారేజ్గా మార్చాను. ఆ వేలం ద్వారా రూ.48 వేలు వచ్చాయి. దానికి కొంత మొత్తం కలిపి స్వాతి ఖర్చులకు అందజేశాను. పుత్రికోత్సాహం.. ఏదో అన్నందుకు ఇంతని ఇచ్చేశాం అని ఊరుకోకుండా తరచూ స్వాతిని కలసి వస్తున్నాను. మనిషికి ‘నా’ అన్నవారు లేరే అనే ఫీలింగ్ జీవితంపై నిరాసక్తతని కలిగిస్తుంది. నాకంటూ ఒక్కరైనా ఉన్నారనే ఆనందం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఆర్థికంగా ఆదుకోవడం ఎంత అవసరమో ఆ భరోసా ఇవ్వడం కూడా అంతే ముఖ్యం అనే ఉద్దేశంతో స్వాతిని కలవడం, కొన్ని గంటల పాటు తనతో కబుర్లు చెప్పడం, ఆడుకోవడం చేస్తున్నాను. స్వాతి చాలా బాగా చదువుతోందని, చాలా చురుకుగా ఉంటోందని నిర్వాహకులు చెబుతుంటే పుత్రికోత్సాహం కలుగుతోంది. తన కల నెరవేరే వరకూ వెన్నంటి ఉండాలనే ఆలోచనకు అది మరింత బలమిస్తోంది. సూపర్‌స్టార్ ఫీలింగ్.. వర్తమానంలో మనం ఎన్నో సాధించవచ్చు.. కాని ఫ్యూచర్ జనరేషన్‌కి మంచి మార్గం చూపలేనిది విజయమే కాదు. నిరుపేద చిన్నారులకు ఉపకరించేలా వలంటరీ యాక్టివిటీస్ చేస్తున్న వారికి వీలున్నంత సహకరిస్తున్నాను. వచ్చే మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా గ్యారేజ్ సేల్ లాంటిదే మరేదైనా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలా ఏటా.. ఒక ఈవెంట్ చేసి ‘స్వాతి’లాంటి కొందరి చిన్నారుల జీవితాల్లోనైనా వెలుగులు నింపగలిగితే.. అది నన్ను నేను సూపర్స్టార్లా భావించుకునేంత గర్వాన్నిస్తుంది. -
మాయ మూవీ ప్రెస్ మీట్
-
ధోతీ పాట హంగామా
‘‘అతీంద్రియ దృష్టి నేపథ్యంలో ఇతర భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది తొలి ప్రయత్నం కాదు. కానీ, ఓ కొత్త అంశంతో ఈ సినిమా చేశాను. వైవిధ్యభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే చక్కని థ్రిల్లర్ ఇది. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా, నందినీరాయ్ ముఖ్య తారలుగా షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భగా శుక్రవారం లగడపాటి శ్రీధర్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు ‘పోకిరి రాజా..’ పాట కూడా ముందుకు నడుస్తుంది. దాన్ని రీమిక్స్ చేశాం. అతి తక్కువ సమయంలో ఈ ‘ధోతీ సాంగ్..’ను చిత్రీకరించాం. ఇది ఇతివృత్తం మీద ఆధారపడిన చిత్రం’’ అన్నారు. ప్రచార గీతం చాలా బాగుందనీ, ఈ చిత్రం నీలకంఠకు మంచి పేరు తెస్తుందనీ లగడపాటి శ్రీధర్ చెప్పారు. ఇంకా హర్షవర్ధన్ రాణే, సిరాశ్రీ, రమ తదితరులు పాల్గొన్నారు.