Neelima Guna : పెళ్లిపీటలెక్కబోతున్న గుణశేఖర్‌ కుమార్తె.. ఫోటోలు వైరల్‌

Gunasekhar Daughter Neelima Guna Pelli Kuthuru Functions Photos Viral - Sakshi

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్‌మ్యాన్‌ను  నీలిమ వివాహం చేసుకోనుంది.

ఇటీవలె వీరి  నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. కాగా  నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు.  తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top