జీఎస్‌టీ టీజర్‌ బాగుంది | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ టీజర్‌ బాగుంది

Published Mon, Dec 28 2020 6:11 AM

GST Movie Official Teaser Launches By Posani Krishna Murali - Sakshi

‘‘నా శిష్యుడు జానకిరామ్‌ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్‌టీ’(దేవుడు సైతాన్‌ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్‌ చాలా బాగుంది.. సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆనంద్‌ కృష్ణ, అశోక్, స్వాతి మండల్, యాంకర్‌ ఇందు, పూజ సుహాసిని ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘జీఎస్‌టీ’(దేవుడు సైతాన్‌ టెక్నాలజీ). కొమారి జానకిరామ్‌ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్‌ని పోసాని కృష్ణమురళి విడుదల చేశారు. జానకిరామ్‌ మాట్లాడుతూ–‘‘సమాజంలో ఎంతో మందికి దేవుడు, దెయ్యం, సైన్స్‌ పైన ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇలాంటి ప్రశ్నలే ఇటీవల కరోనా టైంలో కూడా వచ్చాయి. లాక్‌ డౌన్‌లో భాగంగా అన్ని మాతాల ప్రార్థనాలయాలు మూత పడ్డాయి.  ఈ సమయంలో కరోనా అనే సైతాన్‌ గెలిచిందా? దేవుళ్లు ఓడిపోయారా? ఆ ప్రశ్నల్ని కథగా మలిచి సినిమా తెరకెక్కించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: యు.వి.నిరంజన్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement