Gray The Spy Who Loved Me Movie Pooja Ceremony - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త నిర్మాణ‌సంస్థ ఎంట్రీ

Oct 17 2021 4:41 PM | Updated on Oct 17 2021 5:37 PM

Gray The Spy Who Loved Me Movie Pooja Ceremony - Sakshi

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త నిర్మాణ‌సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ ల‌వ్డ్ మి అనేది ఉప‌శీర్షిక‌. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా  ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం  ఈ సినిమా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మూహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వ‌గా, ప్ర‌సాద్ గ్రూప్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అంద‌జేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ  `గ్రే అనేది ఒక నెగ‌టివ్ షేడ్ అనే  కాదు. ఓ రిలేష‌న్ షిప్‌. ఓ రెవ‌ల్యూష‌న్‌. గ్రే మ‌న‌లైఫ్‌లో ఉంది. మ‌నం వెన‌క్కి తిరిగి చూసుకుంటే మ‌న నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్ల‌ర్‌. న‌మ్మ‌లేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబ‌రు క‌ల్లా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం`అన్నారు. 

`రాజ్ ముదిరాజ్ మంచి ప్ర‌తిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను`అన్నారు ప్ర‌సాద్ గ్రూప్స్ అధినేత ర‌మేష్‌ ప్ర‌సాద్. నిర్మాత కిర‌ణ్ క‌ల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, ర‌మేష్‌చ‌ద‌ల‌వాడ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాకు డ‌బ్బులు పెట్ట‌డం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వ‌డం క‌ష్టం.  గ్రే మంచి సినిమా అవుతుంద‌ని న‌మ్ము తున్నాను. థ్రిల్ల‌ర్ సినిమాలు పెద్ద‌గా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్ల‌ర్ మూవీ`అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement