శివ శంభో లాంటి సినిమాలను గౌరవించాలి: గోరటి వెంకన్న | Goreti Venkanna Talk About Shiva Sambho Movie | Sakshi
Sakshi News home page

శివ శంభో లాంటి సినిమాలను గౌరవించాలి: గోరటి వెంకన్న

Apr 24 2025 1:01 PM | Updated on Apr 24 2025 1:03 PM

Goreti Venkanna Talk About Shiva Sambho Movie

‘‘భక్తి, సంగీతం, సాహిత్యం, నృత్యం నేపథ్యంలో రూపొందిన అరుదైన సినిమా ‘శివ శంభో’. ఇటువంటి చిత్రాలను మనమంతా గౌరవించాలి. అభిరుచి గల ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను తప్పక ఆదరిస్తారు’’ అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్, కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో నర్సింగ్‌ రావు దర్శకత్వం వహించిన భక్తిరస చిత్రం ‘శివ శంభో’. అనంత ఆర్ట్స్‌ బ్యానర్‌పై బొజ్జ రాజగోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. 

ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘శివ శంభో’ లాంటి భక్తి చిత్రాలు అరుదుగా వస్తాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి’’ అన్నారు. 

‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది’’ అని నర్సింగ్‌ రావు తెలి΄ారు. ‘‘థియేటర్‌కు వెళ్లి మా సినిమాని చూడాలి’’ అని నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు సుగుణ దోరవేటి కోరారు. ఈ వేడుకలో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్, బర్దీపుర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్‌ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement