Actor Paul Sorvino Death: సింగర్‌ కావాలనుకుని నటుడిగా మారి.. 50 ఏళ్లకు పైగా..

Goodfellas Actor Paul Sorvino Passed Away At Age 83 - Sakshi

Goodfellas Actor Paul Sorvino Died At Age 83: హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రాలలో 'గుడ్ ఫెల్లాస్‌' ఒకటి. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌ పౌలీ సిసిరో పాత్ర పోషించి మెప్పించిన నటుడు పాల్‌ సోర్వినో. 83 ఏళ్ల పాల్‌ సోర్వినో ఇక లేరు. ఫ్లోరిడా జాక్సన్‌ విల్లేలోని ఓ ఆసుపత్రిలో సహజ కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీంతో హాలీవుడ్‌ చిత్రసీమలో విషాదం నెలకొంది. 'నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. నా జీవితంలోని ప్రేమ, అత్యంత అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాను. మనసు ముక్కలైంది' అని ఆయన భార్య డీ డీ సోర్వినో సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. 

1990 దశకంలో వచ్చిన లా అండ్‌ ఆర్డర్‌ టీవీ సిరీస్‌లో పోలీస్‌ సార్జెంట్‌ ఫిల్‌ సెరెటా పాత్రతో పాపులర్‌ అయ్యాడు సోర్వినో. గత 50 ఏళ్లుగా సినిమాలు, టీవీ షోలు, స్టేజ్‌ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. 1939లో బ్రూక్లిన్‌లో జన్మించిన పాల్‌ సార్వినో సంగీతం కూడా నేర్చుకున్నాడు. నటుడు కాకముందు ఆయన ఒపేరా సింగర్‌ కావాలనుకున్నాడు. ది ఛాంపియన్‌షిప్‌ సీజన్‌, డిక్‌ ట్రేసీ, రెడ్స్‌, నిక్సన్‌ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. 

చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
టాలీవుడ్‌ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top