ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ గురించే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న ఈవెంట్‌కి అభిమానులు బాగానే వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. అయితే మిగతా అందరికీ కాదు గానీ అభిమానులకు మాత్రం ఓ విషయంలో ఇబ్బంది తప్పట్లేదు. పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం పసుపు, ఎరుపు, తెలుపు, ఊదా(వయలెట్) రంగుల్లో పాస్(పాస్‌పోర్ట్స్)లు జారీ చేశారు. వీటిలో అభిమానులకు పసుపు రంగు పాస్‌లు ఇచ్చారు. వీటిని తీసుకుని అభిమానులు కార్యక్రమానికి వెళ్లారు. అయితే మిగతా అన్ని పాస్‌లు ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్య లేదు గానీ పసుపు రంగు పాస్‌లు ఉన్నవాళ్లతో పాటు వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదట. బదులుగా వాటర్ పాకెట్స్ ఇస్తున్నారు గానీ అవి ఏ మేరకు అవసరం ఉన్నవాళ్లకు అందుతాయనేది చూడాలి.
ఈవెంట్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాలంటేనే అభిమానులు.. 3-4 కిలోమీటర్లు నడవాలి అని తెలుస్తోంది. వెళ్లిన తర్వాత కనీసం వాటర్ బాటిల్‌ని కూడా అనుమతించకపోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళితో పాటు ఈ సినిమాలో భాగమైన ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరు కానున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మూవీ టైటిల్‌తో పాటు సినిమా ఎలా ఉండబోతుందా అనే విజువల్స్‌తో కూడిన వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్వీట్ చేశారు.


