హ్యాపీ కర్వాచౌత్‌ గౌతం: కాజల్‌ | Glimpse Of Kajal First Karwa Chauth Celebration | Sakshi
Sakshi News home page

కర్వాచౌత్‌కు సిద్ధమైన అక్కాచెల్లెళ్లు!

Nov 4 2020 5:38 PM | Updated on Nov 4 2020 7:21 PM

Glimpse Of Kajal First Karwa Chauth Celebration - Sakshi

కాజల్‌ జరుపుకుంటున్న మొదటి కర్వా చౌత్‌ ఇదే కావడంతో ఆమె ఆనందం రెట్టింపైంది.

కోవిడ్‌ మహమ్మారి కారణంగా హంగు, ఆర్భాటాలు లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అక్టోబర్‌ 30న ముంబైలోని ప్లష్‌ హోటల్‌లో వివాహం చేసుకున్న కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లూ కూడా తమ పెళ్లి వేడుకను అద్భుతంగా, కన్నులపండుగగా చేసుకున్నా కూడా దానికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ముహూర్తం ఖరారైన నాటి నుంచి వధూవరుల ఇళ్లు వేడుకలకు కొలువైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఈ కొత్తజంట కర్వా చౌత్‌ పండుగ చేసుకోవడంలో నిమగ్నమైంది. భర్త బాగుండాలని భార్య చేసే పూజ ఇది. కార్తిక మాసంలోని పౌర్ణమి తర్వాత నాలుగు రోజులకు వచ్చే ఈ పండుగను ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. (చదవండి: కాజల్‌ నో చెప్పింది ఇందుకే..)

కాగా కాజల్‌ జరుపుకుంటున్న మొదటి కర్వా చౌత్‌ ఇదే కావడంతో ఆమె ఆనందం రెట్టింపైంది. బావ చేతికి మెహెందీ పెడుతున్న నిషా అగర్వాల్, తన పక్కనే కూర్చుని, నవ్వులు చిందిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ ఫోటో సోషల్‌ మీడియాలో కనువిందు చేస్తోంది. కాజల్‌ ఎరుపు రంగు చీరలో, అదే రంగు మాస్క్‌తో తళుక్కుమంటున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు. మరో పోస్ట్‌లో గోరింటాకు పెట్టుకున్న అయిదు చేతులను చూపిస్తూ ‘‘ఎవరు ఎవరో కనిపెట్టండి’’ అంటూ ఫాలోవర్స్‌ను ఆటపట్టించారు. పెళ్లి తర్వాత ముంబాయిలోని కొత్త ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకున్న కాజల్‌, గౌతమ్‌ జంట ఇటీవల ఆ ఇంటికి గృహప్రవేశ వేడుక కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను గౌతమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘కొత్త ప్రారంభాలకు శ్రీకారం. నా భార్యతో మా కొత్త ఇంట్లో..’’ అంటూ పోస్ట్‌ చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement