పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన

Gehana Vasisth Gets Interim Bail By SC She Says I Have Been Framed - Sakshi

Gehana Vasisth Cries: పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్‌కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్‌ ఫైనాన్షియర్‌ రాజ్‌కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానా.. గతంలో అరెస్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులుగా కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్‌ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరు కావాలనే షరతు విధిస్తూ..  జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల ధర్మాసనం బుధవారం వెల్లడించింది. 

చదవండి: Shilpa Shetty: నేను షూటింగ్స్‌తో బిజీ..ఆ యాప్స్‌ గురించి నాకు తెలియదు

సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్‌పై నటి గెహనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  

చదవండి: శృంగారానికి, అశ్లీలానికి తేడా తెలుసా?: నటి

గతంలో ఆమె బాంబే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని, అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా కు మొన్న సోమవారం బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top