పోర్న్‌ రాకెట్‌: వాళ్లే ఈ నటి టార్గెట్‌!

Gehana Vasisth Paid 15 To 20 Thousand For A Video To Actors - Sakshi

ముంబై : పోర్న్‌ వీడియో రాకెట్‌ కేసులో నటి, మోడల్‌ గెహ్నా వశిష్ట్‌ శనివారం అరెస్టయిన సంగతి తెలిసిందే.  క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం ఆమెను సిటీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు బుధవారం వరకు పోలీస్‌ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో గెహ్నాను విచారించిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఓ పోలీస్‌ అధికారి దీనిపై మాట్లాడుతూ.. ఆమె సినిమాల్లో అవకాశాల కోసం కష్టాలు పడుతున్న నటులను టార్గెట్‌ చేసేదని తెలిపారు. ఔత్సాహిక నటులను ట్రాప్‌ చేసి వారిని రూ.15 వేలు, రూ. 20 వేల కోసం పోర్న్‌ వీడియోలలో నటించేలా చేసేదని చెప్పారు. అలా 87 పోర్న్‌ వీడియోలను చిత్రీకరించిన ఆమె వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేదని, ఆ వీడియోలు చూడాలనుకునే వారి వద్ద నుంచి సబ్‌స్క్రిప్చన్‌ ఫీజు కింద రూ. 2 వేలు వసూలు చేసేదని వెల్లడించారు. సబ్‌స్క్రిప్చన్ల ద్వారా రూ. 36 లక్షల రూపాయలు సంపాదించిందని తెలిపారు. ( పోర్న్‌ వీడియో రాకెట్‌: నటి అరెస్ట్‌ )

దీనిపై గెహ్నా ప్రెస్‌, లీగల్‌ టీం స్పందిస్తూ.. ‘‘ గెహ్నా వశిష్ట్‌ అలియాస్‌ వందనా తివారీ అమాయకురాలు. పోర్న్‌ రాకెట్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యర్థులు ఆమెను అపఖ్యాతిపాలు చేయటానికే ఈ కేసులో ఇరికించారు’’ అని పేర్కొంది.  ( మోడల్స్‌, నటీ, నటులతో పోర్న్‌ వీడియోలు‌ )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top