నార్మల్‌ డెలివరీ కంటే ఆపరేషన్‌ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు | Gauahar Khan About Miscarriage and Suniel Shetty Comments | Sakshi
Sakshi News home page

Gauahar Khan: 9 వారాలకే గర్భస్రావం.. ఆ బాధను మాటల్లో చెప్పలేను

Jun 2 2025 1:06 PM | Updated on Jun 2 2025 1:30 PM

Gauahar Khan About Miscarriage and Suniel Shetty Comments

కొన్ని సంతోషాలను కోట్లు పెట్టినా సొంతం చేసుకోలేము. ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం కోట్లు వదిలేసుకున్నా బాధ ఉండదు. మహిళకు అత్యంత ఆనందాన్నిచ్చేది అమ్మతనం. 'అమ్మ'యినందుకే ఇలియానా సూపర్‌ హిట్‌ మూవీ రైడ్‌కు సీక్వెల్‌లో చేయమని ఆఫర్‌ వచ్చినా వదిలేసుకుంది. కళ్లు చెదిరే పారితోషికం ఇస్తామన్నా.. ప్రస్తుతం తన కొడుకును చూసుకోవడమే ముఖ్యం అని కరాఖండిగా చెప్పేసింది.

మిస్‌క్యారేజ్‌
అయితే కొందరికి అమ్మతనం అంత ఈజీగా దొరకదు. చాలామందికి మొదటి కాన్పు ఆగదు. గర్భస్రావం అవుతూ ఉంటుంది. బాలీవుడ్‌ నటి, మోడల్‌, హిందీ బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ గౌహర్‌ ఖాన్‌ (Gauahar Khan) జీవితంలోనూ అదే జరిగింది. తొలిసారి తన మిస్‌క్యారేజ్‌ అనుభవాలను యూట్యూబ్‌ వేదికగా వెల్లడించింది. గౌహర్‌.. మానొరంజన్‌ అనే పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. ఇందులో మాతృత్వం గురించి, పిల్లల పెంపకం గురించే మాట్లాడనుంది. మొదటగా ఈ పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను వెల్లడించింది.

9 వారాలకే కుప్పకూలిన ఆశలు
ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పనేలేదు. ఈసారి దాన్ని బయటపెడుతున్నా.. జెహాన్‌ పుట్టడానికంటే ముందు నాకు గర్భస్రావం అయింది. ఆ బాధను మాటల్లో చెప్పలేను. దాదాపు 9 వారాలపాటు కడుపులో మోశాక బిడ్డను కోల్పోయాను. నా సంతోషం ఆవిరైపోయింది. దీని గురించి తర్వాతి ఎపిసోడ్స్‌లో మాట్లాడతాను. జెహాన్‌ పుట్టినప్పటి నుంచి అది సాధారణ డెలివరీనా? సీ సెక్షనా? అని అడుగుతూనే ఉన్నారు. నాకు సీ సెక్షన్‌ చేశారు. అయినా రెండూ కష్టమే.. 

మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు
ఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్‌ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా ఆపరేషన్‌ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే గట్టిగా అరవాలనిపించింది. అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్‌ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలే అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు అని కన్నీళ్లు పెట్టుకుంది. నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty).. తన కూతురు అతియా కంఫర్టబుల్‌గా ఉంటుందని సీ సెక్షన్‌కు వెళ్లకుండా కష్టమైనా నేచురల్‌ డెలివరీనే ఎంచుకుందని కామెంట్స్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పాడు.

ఎవరీ గౌహర్‌ ఖాన్‌?
గౌహర్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. ఈమె శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లో నా పేరే కాంచనమాల అనే ఐటం సాంగ్‌తో అలరించింది. రాకెట్‌ సింగ్‌, ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్‌ గయా, ఫీవర్‌, తేరే ఇంతేజార్‌ వంటి పలు చిత్రాలు చేసింది. తాండవ్‌, సాల్ట్‌ సిటీ, బెస్ట్‌ సెల్లర్‌ వంటి వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను 2020లో పెళ్లి చేసుకోగా 2023లో కుమారుడు జెహాన్‌ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.

చదవండి: ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్‌.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement