'గేమ్ ఆన్' టీజర్.. దసరా థియేటర్స్‌లో సందడి | Game On Teaser Released Today Screening On Dasara Theatres | Sakshi
Sakshi News home page

Game On Movie: 'గేమ్ ఆన్' టీజర్.. దసరా థియేటర్స్‌లో సందడి

Apr 1 2023 9:20 PM | Updated on Apr 1 2023 9:25 PM

Game On Teaser Released Today Screening On Dasara Theatres - Sakshi

గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం ఇందులో విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర  టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.  దసరా సినిమా విడుదలైన థియేటర్లలో టీజర్‌ను ప్రదర్శించారు.

నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ..' గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.  నాని హీరోగా నటించిన దసరా సినిమాతో మా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. స్పందన అద్భుతంగా ఉంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములు పని చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమా చెయ్యడం విశేషం. అందరూ ఎంతో కష్టపడి పనిచేశాం.  అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.' అని అన్నారు. 

దర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ..' రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. సరికొత్త ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా మా బ్రదర్‌పై నమ్మకం పెట్టి ఈ కథ  రాసుకుని డైరెక్ట్ చేస్తున్నా. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి.' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement