Gali Janardhan Son Gali Kireeti Debut Movie Title Poster Released, Deets Inside - Sakshi
Sakshi News home page

Gaali Kireeti Debut Movie: గాలి జనార్ధన్‌ రెడ్డి కొడుకు కిరీటి మూవీ టైటిల్‌ ఇదే

Oct 1 2022 9:28 AM | Updated on Oct 1 2022 2:05 PM

Gali Janardhan Son Gali Kireeti Debut Movie Title Poster Released - Sakshi

కన్నడ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి వారసుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు. రాధాకృష్ణన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు రవిచంద్రన్, జెనీలియా, నితేష్‌ దేశ్‌ముఖ్, శ్రీలీల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి చిత్రం ఫేమ్‌ సెంథిల్‌కుమార్‌ చాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి ఫిలిమ్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి కథానాయకుడిగా పరిచయం అవుతున్న కిరీటికి ఆశీస్సులు అందించారు. శ్రమకు గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నా రు. కాగా గురువారం నటుడు కిరీటి పుట్టినరోజు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిరీటి కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర టైటిల్‌ ప్రకటించారు. దీనికి జూనియర్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోందని చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ జోరుగా సాగుతోందని దర్శకుడు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement