Gali Janardhan Reddy Son Kireeti Reddy Debut Movie Update - Sakshi
Sakshi News home page

Gali Kireeti Reddy: హీరోగా ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి కుమారుడి ఎంట్రీ, టైటిల్‌ ఖరారు

Mar 2 2022 8:05 AM | Updated on Mar 2 2022 9:59 AM

Gali Janardhan Reddy Son Kireeti Reddy Debut Movie Update - Sakshi

క‌ర్ణాట‌క మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు గాలి కిరిటి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరిటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్‌ వర్క్‌, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి రానుందంటూ తాజాగా చిత్ర బృందం అప్‌డేట్‌ ఇచ్చింది. యువ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు వారాహి అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  

చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే..

తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్‌ హెయిన్‌ స్టంట్స్‌ సమకూర్చుతున్నారు. ఈ మూవీలో మిగతా నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న ఆలోచ‌న రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వ‌దేశంతో పాటు విదేశాల్లోనూ ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జ‌నాల‌ను మెప్పిస్తారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement