ఫుల్లుగా తాగి వేలు క‌త్తిరించుకున్న స్టార్‌ హీరోయిన్!‌‌ | Gal Gadot Chopped Top Of Her Finger After Drinking Too Much | Sakshi
Sakshi News home page

తెగిన హీరోయిన్‌ వేలు, డ‌స్ట్‌బిన్‌లో ప‌డేసిన భ‌ర్త!

Apr 25 2021 6:40 PM | Updated on Apr 25 2021 8:47 PM

Gal Gadot Chopped Top Of Her Finger After Drinking Too Much - Sakshi

నేను మాత్రం బాగా తాగాను. స‌రిగ్గా అప్పుడే క్యాబేజీ స‌లాడ్ చేయ‌మ‌ని నా భ‌ర్త చెప్ప‌డంతోని వంటింట్లోకి వెళ్లాను..

తాగిన మ‌త్తులో కూర‌గాయలు క‌ట్ చేయ‌బోయి ఏకంగా చేతి వేలినే క‌త్తిరించేసుకుందో హాలీవుడ్ స్టార్‌. వండ‌ర్ వుమెన్‌లో ప్ర‌ధాన పాత్ర పోషించిన గాల్ గ్యాడ‌ట్ ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది క‌రోనా వ్యాప్తి మొద‌లైన తొలినాళ్ల‌లో జ‌రిగింది. అస‌లు ఎవ‌రైనా ఉద‌యం 11 గంట‌ల‌కు మిమోసా లేదా సంగ్రియా తాగుతారా? కానీ నేను మాత్రం తాగాను. స‌రిగ్గా అప్పుడే క్యాబేజీ స‌లాడ్ చేయ‌మ‌ని నా భ‌ర్త చెప్ప‌డంతోని వంటింట్లోకి వెళ్లాను"

"ప‌దునైన  క‌త్తి తీసుకుని చ‌క‌చ‌కా క‌ట్ చేయ‌డం మొద‌లుపెట్టాను. ఇంత‌లో నా వేలు తెగింది. అదేదో చిన్న గాయం కూడా కాదు. వేలు పై భాగం తెగిప‌డింది. వెంట‌నే నా భ‌ర్త యార‌న్ వార్స‌నో ప‌రుప‌రుగున వ‌చ్చి ఆ తెగిప‌డిన వేలి పై భాగాన్ని తీసుకుని చూశాడు. దాన్ని తీసి చెత్త‌బుట్ట‌లోకి విసిరేశాడు. దాన్ని ఎలాగో అతికించ‌డానికి వీలుకాదు కాబ‌ట్టి ఆస్ప‌త్రికి కూడా వెళ్ల‌లేదు" అని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే గాల్ గ్యాడ్ త్వ‌ర‌లో మూడో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ఈ మ‌ధ్యే ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది.

చ‌ద‌వండి:‌ ఓ ఇంటివాడైన‌ క్రాక్ సినిమాటోగ్రాఫ‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement