Fire Break In Puducherry Theatres During Screening Of Vikram Movie Climax Scene, Goes Viral - Sakshi
Sakshi News home page

Virkam Movie: సూర్య ఎంట్రీ సీన్‌.. స్క్రీన్‌ తగలబెట్టిన ఫ్యాన్స్‌!

Jun 8 2022 2:57 PM | Updated on Jun 8 2022 4:31 PM

Fire Break In Puducherry Theatres During Screening Of Vikram Movie - Sakshi

 పుదుచ్చేరిలోని జయ థియేటర్‌లో నిప్పులు చెలరేగాయి. హీరో సూర్య ఎంట్రీ సీన్‌ రాగానే తెరకు ఓవైపు నుంచి అగ్గి రాజుకుంది. అది నెమ్మదిగా స్క్రీన్‌ అంతా వ్యాపించింది.

సౌత్‌లో ఇప్పుడు బాగా మార్మోగిపోతున్న సినిమా విక్రమ్‌. కమల్‌ హాసన్‌, ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. నలుగురు హీరోలను ఒకే సినిమాలో చూసి ఫ్యాన్స్‌ మురిసిపోయారు. యాక్షన్‌ సన్నివేశాలకు ఈలలు వేశారు. దర్శకుడిగా లోకేశ్‌ కనగరాజన్‌కు పదికి పది మార్కులు వేశారు. ఆల్‌రెడీ సినిమా చూసినవారు సైతం వన్స్‌ మోర్‌ అంటూ థియేటర్‌ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఫ్యాన్స్‌ అత్యుత్సాహమో, థియేటర్‌ నిర్వహణ లోపమో తెలీదుగానీ విక్రమ్‌ సినిమా ప్రసారమవుతున్న థియేటర్‌లో మంటలు చెలరేగాయి. పుదుచ్చేరిలోని జయ థియేటర్‌లో నిప్పులు చెలరేగాయి. హీరో సూర్య ఎంట్రీ సీన్‌ రాగానే తెరకు ఓవైపు నుంచి అగ్గి రాజుకుంది. అది నెమ్మదిగా స్క్రీన్‌ అంతా వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి అని కొందరు అంటుంటే సూర్య ఫ్యాన్స్‌ పటాసులు పేల్చడం వల్లే ఆ ప్రమాదం సంభవించిందని మరికొందరు అంటున్నారు.

చదవండి: 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కమల్‌ ఖరీదైన బైక్స్‌ గిఫ్ట్‌
 నయనతార-విఘ్నేష్​ శివన్​ పెళ్లి ఆహ్వాన వీడియో అదిరిపోయిందిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement