నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్‌ నాకు స్పెషలే: పాయల్‌ రాజ్‌పుత్‌ | Father's Day 2023: Payal Rajput Talk About Her Father Vimal Kumar Rajput | Sakshi
Sakshi News home page

జీవితం అంటే ఏంటో మా నాన్న నేర్పించారు: పాయల్‌ రాజ్‌పుత్‌

Jun 18 2023 10:14 AM | Updated on Jun 18 2023 10:14 AM

Father's Day 2023: Payal Rajput Talk About Her Father Vimal Kumar Rajput - Sakshi

‘తండ్రీకూతుళ్ల అనుబంధం అపురూపమైనది.. మాటల్లో వర్ణించలేనిది. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్‌ నాకు స్పెషలే. అర్ధరాత్రివరకూ సాగే కబుర్లు, సరదా ఆటలు, చిన్నపాటి సాహసాలు వంటివి తండ్రీకూతుళ్ల అనుబంధాలను చాలా స్పెషల్‌గా మార్చుతాయి. మా లైఫ్‌లో అలాంటి ప్రత్యేక సమయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారే నా బలం. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా ఆయనే’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రి విమల్‌కుమార్‌ రాజ్‌పుత్‌ గురించి పాయల్‌ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. 

► జీవితం అంటే ఏంటో మా నాన్న నాకు నేర్పించారు. అలాగే మనతో మనం నిజాయతీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో డైరెక్షన్‌లో వెళుతుంది. తండ్రీ కూతురి జీవితం కూడా అంతే. మా లైఫ్‌ వెళ్లే డైరెక్షన్‌ ఏదైనా మా బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. అది ‘అన్‌బ్రేకబుల్‌’.

► చాలా విషయాల్లో మా నాన్న నాకు స్ఫూర్తిగా ఉంటారు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి? అనే విషయాలు మాత్రం నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే తోటివారితో ఎలా మసులుకోవాలో కూడా ఆయన్ను చూసే తెలుసుకున్నాను. హార్డ్‌వర్క్‌ చేసేవారికి ఉండే విలువ ఏంటో నాన్న నాకు చెప్పారు. అలాగే మనం నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. నా కలల విషయంలో రాజీ పడకుండా నన్ను నేను ఓ బెటర్‌ పర్సన్‌గా తీర్చిదిద్దుకోవడానికి మా నాన్నగారి మాటలు, ఆచరణ విధానాలే నాకు దోహదపడ్డాయి.  

► మా నాన్న చాలా ట్రెడిషనల్‌. నేను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా.. నటనపై నాకు ఉన్న ప్యాషన్‌ను, సినిమా ఇండస్ట్రీ పంథాను అర్థం చేసుకున్నాక నన్ను సపోర్ట్‌ చేయడం మొదలుపెట్టారు. వృత్తిపరంగా నిరూపించుకునే విషయంలో అసలు ఏ మాత్రం తగ్గొద్దు అని అంటుంటారు. అంతేకాదు..కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి మా నాన్న ఒకప్పుడు యాక్టర్‌ కావాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు ఆయన కలను నేను నిజం చేసినందుకు గర్వంగా ఉంది.

► ఓ నటిగా నా కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడతారు. ‘నీ ప్రయాణంలో జయాపజయాలు ఓ భాగం మాత్రమే. వైఫల్యాలు ఎదురైతే వాటిని మైండ్‌కు ఎక్కించుకోకు. ఏదైనా తాత్కాలికమే. ఏదీ శాశ్వతం కాదు. సో.. జీవితం ఎలా వస్తే అలా ఉండు.. హ్యాపీగా ఉండు’ అంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement