హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

Farmers President Complaints Collector On Actor Yash About Land Dispute - Sakshi

యశవంతపుర: కేజీఎఫ్‌ ఫేమ్‌.. హీరో యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్‌ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మించి రైతులకు ఇబ్బందులకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూండాలను రప్పించి గ్రామస్తులను యశ్‌ భయపెడుతున్నట్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా ఇటీవలే యశ్‌ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్‌ తల్లి కర్ణాటకలోని హాసన్‌ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్‌ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్‌ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్‌ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: భూ వివాదంలో హీరో యశ్‌ కుటుంబం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top