జోయా అఖ్తర్‌ యాక్టర్స్‌కు సెలవులివ్వదట, కారణం?

Fact About Zoya Akhtar, Sanjay leela Bhansali, Anurag Kashyap Sentiments - Sakshi

సినిమా.. ఆన్‌ స్క్రీన్‌ .. ఆఫ్‌ స్క్రీన్‌ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో  హీరోహీరోయిన్స్‌ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్‌ సరే.. దర్శకుల స్టయిల్‌ ఆఫ్‌ మూవీ మేకింగ్‌ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్‌నే క్యాచ్‌ చేశాం. ఇలా.. !

బయటకు వెళ్లిపోతారనే..
జోయా అఖ్తర్‌.. దర్శకురాలిగానే కాదు.. రైటర్‌గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్‌ను షూట్‌ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు.  రీటేక్స్‌ విషయంలో చాలా లిబరల్‌గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్‌ ధడక్‌నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్‌కు.. తన తోబుట్టువు ఫర్హాన్‌ అఖ్తర్‌తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌లో యాక్టర్స్‌కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. 

నో డీటైలింగ్‌.. 
సంజయ్‌ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్‌ మిస్‌ అవడు కానీ  నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్‌ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు..  తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. 

డార్క్‌ స్టోరీ
అనురాగ్‌ కశ్యప్‌ సినిమాలు ఎక్కువగా డార్క్‌ టాపిక్స్‌ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్‌ అబ్యూజ్‌ విక్టిమ్‌ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్‌ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకోవాలి. సీన్స్‌ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్‌ ఇన్సిడెంట్స్‌ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్‌ను ఇష్టపడడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top