నితిన్‌ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' టాక్‌ ఎలా ఉందంటే? | Sakshi
Sakshi News home page

Extra Ordinary Man Twitter Review: 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' టాక్‌ ఎలా ఉందంటే?

Published Fri, Dec 8 2023 9:05 AM

Extra Ordinary Man Twitter Review Telugu - Sakshi

టాలీవుడ్‌ హీరో నితిన్‌ 32వ సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' నేడు (డిసెంబర్‌ 8) విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా.. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు.  వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్‌ అని సినిమా విడుదలకు ముందు నితిన్‌ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు.  సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్‌. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఫుల్‌ కామెడీ ఉందని ఎంజాయ్‌ చేస్తున్నారు.

భీష్మ త‌ర్వాత నితిన్‌కు స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్‌ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నితిన్‌ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించడం విశేషం. ఈ క్యారెక్ట‌ర్‌లో ఆయన ఫర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడని,  అత‌డి కామెడీ టైమింగ్ కూడా బాగుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' ఫుల్ ఫ‌న్‌తో కూడిన చిత్రమని చెబుతున్నారు.

ఈ సినిమా ద్వారా నితిన్‌ సరికొత్త రోల్‌లో కనిపించి  అద‌ర‌గొట్టాడ‌ని నెటిజన్లు తెలుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాకు  రావు రమేష్‌ పాత్ర ప్రధాన బలం అని ఒకరు చెబుతుంటే.. ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచాడని తెలుపుతున్నారు. ద్వితీయార్దంలో అయితే ఫుల్‌ ఫన్‌గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు.  

రాజ‌శేఖ‌ర్‌ రోల్‌ త‌క్కువే అయినా ఆయ‌న క‌నిపించిన సీన్స్ మొత్తం ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కథలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుపుతున్నారు. అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని తెలుపుతున్నారు. ద్వితియార్థం నుంచి థియేటర్‌లో నవ్వులు తెప్పిస్తాయని తెలుపుతున్న నెటిజన్లు.. సినిమా మాత్రం ఎలాంటి డిస్పాయింట్‌మెంట్‌కు గురిచేయదని తెలుపుతన్నారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement