జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మరోసారి ఈడీ సమన్లు | ED Notice Issued To Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మరోసారి ఈడీ సమన్లు

Published Wed, Jul 10 2024 3:31 PM | Last Updated on Wed, Jul 10 2024 3:31 PM

ED Notice Issued To Jacqueline Fernandez

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. రూ. 200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో సుమారు రెండేళ్ల క్రితం ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు జైల్లో ఉన్న సుకేశ్ పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో ఆమె పలుమార్లు  కోర్టును కూడా ఆశ్రయించింది.

అయితే, తాజాగా ఈ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో ఈడీ పలుమార్లు ఆమెను ఇప్పటికే విచారించింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్‌ చేసింది.

సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ చాలా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించింది. అయితే, సుకేశ్ తన జీవితాన్ని నాశనం చేశాడని జాక్వెలిన్‌ కోర్టు ముందు గతంలో వాపోయింది. అతని వల్ల సినిమా ఛాన్స్‌లు కూడా పోయాయని ఆమె తెలిపింది. తన కెరీర్‌తో సుకేశ్‌ ఆడుకున్నాడని కోర్టు ఎదుట జాక్వెలిన్‌ వాపోయింది. కొన్నేళ్లుగా సుకేశ్ చంద్రశేఖర్‌ తీహార్‌ జైల్లో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement