ఈడీ విచారణకు రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా!

Does Know Whose The Car That Rhea Chakraborty Came To ED Office - Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడి కార్యాలయాని​కి అత్యంత ఖరీదైన  ఫోర్డ్ ఎడీవోర్‌లో కారులో వచ్చారు. దీంతో రియాకు అంత ఖరీదైన లగ్జరీ కారు ఎక్కడదనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. అయితే రియా వచ్చిన ఆ కారు ఆమెది కాదని వెల్లడైంది. ముంబైకి చెందిన ప్రముఖ స్టార్‌ హోటల్స్‌ వ్యవస్థాపకుడు సువేద్ లోహియాదిగా తెలుస్తోంది. అతడు సల్మాన్ ఖాన్ 2014 చిత్రం ‘జై హో’లో ఓ చిన్న పాత్రను పోషించాడు. అభిషేక్ కపూర్ ‘ఆర్యన్: అన్‌ బ్రేకబుల్‌’లో కూడా నటించాడు. అయితే సువేద్‌ చిత్ర పరిశ్రమలో చాలా మందికి సుపరిచితుడు. వివిధ కార్యక్రమాల్లో నటీనటులతో కలిసి తీసుకున్న ఫొటోలను తరచూ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. (చదవండి: ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)

అయితే సుశాంత్‌కు సువేద్‌ మంచి స్నేహితులని కూడా తెలుస్తోంది. ఇటీవల సుశాంత్‌ చనిపోయిన నెలరోజులకు (జూలై 14) సువేద్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టును పంచుకున్నాడు. సుశాంత్‌ తనకు ఎంత మంచి స్నేహితుడో  గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘‘నేను ఆకాశం వైపు చూసినప్పుడు ఆ మేఘాల మధ్య నువ్వు ఉన్నావని తెలుసు. అప్పుడు అది ఎంతో ఆకర్షనీయంగా తయారైంది.  మీ కల్లలో పాలపుంత. నక్షత్రాలు మీ నరాల్లో నృత్యం చేస్తున్నాయి. విశ్వమంతా నువ్వే ఉన్నావు!!! నువ్వు ఈ లోకాన్ని విడిచి ఒక నెల గడిచిపోయింది. కానీ ఇప్పటికీ మిమ్మల్ని మిస్‌ అవుతున్నాము.. మిస్ యు భాయ్’’ అంటూ సుశాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. అదే విధంగా సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం సూవేద్‌ ‘నువ్వు నాకు జీవితాంతం మచ్చను మిగిల్చావు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. (చదవండి: రియా కాల్‌ రికార్డు: మహేష్‌ భట్‌కు 16 కాల్స్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top