సమంత- నాగచైతన్య జంట సొంత సంపాదన ఎంతో తెలుసా? | Do You Know Naga Chaitanya And Samantha Akkineni's Combined Net Worth? | Sakshi
Sakshi News home page

చై-సామ్ జంట ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

May 6 2021 11:42 AM | Updated on May 6 2021 2:52 PM

Do You Know Naga Chaitanya And Samantha Akkineni's Combined Net Worth? - Sakshi

గత పదేళ్ల నుంచి టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సామ్‌.. ఆస్తులను బాగానే కూడబెట్టిందట. సమంత ఒక్కో సినిమా ఎంత తీసుకుంటుందంటే..

టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట.. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే వృత్తిపరంగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సీరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగచైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా గతనెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో  సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు చై. కరోనా సెకండ్‌వేవ్‌  కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయింది. 



ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చై-సామ్‌ల సంపాదన హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి తర్వాత వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల వీరిద్దరు నటించిన చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో రెమ్యునరేషన్‌ కూడా భారీగా తీసుకుంటున్నారట. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. గత పదేళ్ల నుంచి టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సామ్‌.. ఆస్తులను బాగానే కూడబెట్టిందట.

ఆమె ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఆమె రెండు స్టార్టప్‌లను కూడా కలిగి ఉంది. వాటిలో ఒకటి ఏకామ్‌ అనే ఫ్రీ స్కూల్‌ కాగా, మరొకటి ఫ్యాషన్‌ లేబుల్‌ సాకి. వీటి ద్వారా కూడా బాగే సంపాదిస్తుంది సమంత. ఆమెకి రూ.76 లక్షల విలువపై విలాసవంతమైన బీఎమ్‌డబ్ల్యూ కారు కూడా ఉంది. వీటన్నింటితో కలిపి సమంత మొత్తం ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్‌లోనే ఆయన రూ.40 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం. అలాగే ఖరీదైన కార్లు, బంగ్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ జంట సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల విలువ రూ.125కోట్ల వరకు ఉంటుందని సినీ పండితుల అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement