దీపాల వెలుగులు.. బాలీవుడ్‌ తారల మెరుపులు | Sakshi
Sakshi News home page

Diwali Celebrations: దీపాల వెలుగులు.. బాలీవుడ్‌ తారల మెరుపులు

Published Thu, Oct 20 2022 3:11 PM

Diwali Celabrations: Amitabh Bachchan to Shahrukh Khan Best Throwback Bollywood Parties - Sakshi

ఈ ఏడాది దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్‌ 24న దీపావళి వేడుకకు భారత దేశమంత సిద్ధమవుతుంది. ఇక పండగ అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక్కచోట చేరి ఆనందంగా గడపడం. అన్ని పండుగల్లో ప్రత్యేకత సంతరించుకునేది దీపావళి. ఈ పండగ​కు మాత్రమే ఒకరి ఇంటికి మరోకరు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంత ఒక్కచోట చేరి టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉత్తరాదిలో కనిపిస్తుంది. ఇక నార్త్‌ అనగానే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్‌.

 ప్రతి దీపావళికి బాలీవుడ్‌ సెలబ్రెటీలంత ఒక కుటుంబంగా మారిపోతారు. ఈ సందర్భంగా తమ విలావంత భవనంలో గ్రాండ్‌ పార్టీని నిర్వహించి బి-టౌన్‌ తారలకు ఆతిథ్యం ఇస్తుంటారు. అందులో అమితాబ్‌, షారుక్‌, కుటుంబం ముందుంటుంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లు ఈ వేడుకను చాలా సింపుల్‌ జరుపుకుంది బి-టౌన్‌. అందుకే గత రెండేళ్లు దీపావళి సందడి పెద్దగా కనిపించలేదు. మరి ఈ ఏడాది బాలీవుడ్‌ తారలు దీపావళి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, కాజోల్‌, కపూర్‌ కుటుంబం వంటి తారలు దీపావళిని ఎలా సెలబ్రెట్‌ చేసుకున్నారో ఓ సారి చూద్దాం. 

అమితాబ్ బచ్చన్ ‘జల్సా’ సందడి
ప్రతి ఏడాది బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తన ఇంటిలో దీపావళి పార్టీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో బాలీవుడ్‌ తారలందరిక ఆహ్వానం అందుతుంది. ఆ రోజు సాయంత్రం ముంబైలోని ఆయన బంగ్లా జల్సాలో బాలీవుడ్‌ తారలంత మెరుస్తారు.  2019లో ఆయన ఆయన హోస్ట్‌ చేసిన దీపావళి పార్టీలో షారూఖ్ ఖాన్, కాజోల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సారా అలీ ఖాన్‌, దీపికా పదుకొనే వరకు అందరూ బిగ్ బి దీపావళి పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీ షారుక్‌ తన భార్య గౌరీ ఖాన్‌తో రాగా సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో వచ్చింది. సెలబ్రెటీ కపుల్‌ అయిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. 

షారుక్ ఖాన్‌ ‘మన్నత్‌’ వెలుగులు
ఇక బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన భార్య గౌర్‌ ఖాన్‌, కూతురు, కొడుకలతో దీపావళికి చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంత ఒకే రంగు దుస్తులు ధరించి దీపావళికి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారు. తమ విలాసవంతమైన బంగ్లా మన్నత్‌ను దీపాలతో కలకలలాడుతుంది. ప్రతి ఏడాది సెలబ్రెటీల అత్యత్తుమ దీపావళి సెలబ్రెషన్స్‌లో ఈ షారుక్‌ దంపతులు మొదటి స్థానంలో నిలుస్తారు. అంతేకాదు వీరి ఫొటోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటాయి. 

కపూర్‌ ఫ్యామిలీ దీపావళి తళుకులు
బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అన్నదమ్ములైన బోని కపూర్‌, అనిల్‌ కపూర్‌, సంజయ్‌ కపూర్‌ల కుటుంబాలు ప్రతి స్పెషల్‌ డేస్‌కు ఒక్కచోట చేరిపోతారు. ప్రతి దీపావళికి అనిల్‌ కపూర్‌, ఆయన భార్య సునీతా కపూర్‌ తమ నివాసం జూహులో గ్రాండ్‌ పార్టీని నిర్వహిస్తారు. ఈ పార్టీకి చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇక 2021లో కరోనా కారణంగా దీపావళిని కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకున్నారు. ఈ వేడుకలో బోని కపూర్‌ ఆయన కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌, అర్జున్ కపూర్, అతడి ప్రియురాలు మలైకా అరోరా,అనిల్‌ కపూర్‌ కూతురు సోనమ్‌ కపూర్‌ ఆమె భర్త ఆనంత్‌ ఆహుజా, షానయా కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, మహీప్ కపూర్ తదితరులు భారతీయ వస్త్రధారణలో మెరిశారు. 

కరణ్ జోహార్ 
బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ సినీ సెలబ్రెటీల కోసం ఆయన తరచూ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇక అందులో దీపావళి అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. 2019లో, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో పనిచేసే నటీనటులతో పాటు సిబ్బంది కోసం దీపావళిని గ్రాండ్‌గా హోస్ట్‌ చేశారు. ఈ వేడుకలో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్,  నేహా ధూపియా ఇతర నటీనటులు సందడి చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement