హీరోగా పరిచయమవుతున్న డైరెక్టర్‌ విక్రమన్‌ తనయుడు | Director Vikraman Son Kanishka Debut to Industry As Hero | Sakshi
Sakshi News home page

హీరోగా పరిచయమవుతున్న డైరెక్టర్‌ విక్రమన్‌ తనయుడు

Oct 17 2022 10:21 AM | Updated on Oct 17 2022 12:01 PM

Director Vikraman Son Kanishka Debut to Industry As Hero - Sakshi

కేఎస్‌ రవికుమార్‌, విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్కా

ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ఇప్పుడు నటుడిగానూ అలరిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తన ఆర్కే సెల్యులాయిడ్‌ ద్వారా నిర్మిస్తున్న చిత్రం హిట్‌లిస్ట్‌. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్‌ వారసుడు విజయ్‌ కనిష్కా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్య, కదీర్, కార్తికేయన్‌ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటుడు శరత్‌కుమార్‌ ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

చదవండి: ఓటీటీలోకి 'బింబిసార'.. స్ట్రీమింగ్‌ అయ్యేది అక్కడే

దర్శకుడు కేఎస్‌ రవికుమార్, సితార, మునీష్‌ కాంత్, రెడిన్‌ కింగ్సీ, అభినయ, కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామచంద్ర, మైమ్‌ గోపి, అనుపమ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ నటుడు విజయ్‌ కనిష్కా పుట్టినరోజు సందర్భంగా శనివారం ప్రారంభమైంది. నటుడు విజయ్‌ కనిష్కా, నటి సితారపై ముహూర్తం షాట్‌  చిత్రీకరించారు. చిత్ర వి వరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ వంటి జనరంజక అంశాలతో కూడిన చక్కని కు టుంబ కథా చి త్రంగా హిట్‌లిస్ట్‌ ఉంటుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement