పుష్ప 2 ట్రైలర్‌పై దర్శకధీరుడు 'రాజమౌళి' కామెంట్స్‌ | Director SS Rajamouli Comments Pushpa Trailer | Sakshi
Sakshi News home page

పుష్ప 2 ట్రైలర్‌పై దర్శకధీరుడు 'రాజమౌళి' కామెంట్స్‌

Nov 18 2024 1:32 PM | Updated on Nov 18 2024 2:49 PM

Director SS Rajamouli Comments Pushpa Trailer

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన కూడా ఇప్పుడు పుష్పగాడి రూల్‌ నడుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రతి సినిమా అభిమాని అల్లు అర్జున్‌ గురించే చర్చించుకుంటున్నారు. పట్నాలో జరిగిన ట్రైలర్‌ ఈవెంట్‌కు కోసం ఆయన ఫ్యాన్స్‌భారీగా తరలి వచ్చారు. దీంతో బీహార్‌ షేర్‌ అంటూ బన్నీని ప్రశంసిస్తున్నారు. అయితే, ట్రైలర్‌ను చూసిన స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి పుష్ప యూనిట్‌ను అభినందించారు.

పుష్ప ట్రైలర్‌పై చాలామంది సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి చేసిన ట్వీట్‌ బన్నీ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతుంది. 'పట్నాలో పుష్ప వైల్డ్‌ఫైర్‌ మొదలైంది. అదీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. డిసెంబర్‌ 5న విస్పోటనం చెందుతుంది. పార్టీ కోసం ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నాం పుష్ప' అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, అల్లు అర్జున్‌ కూడా  జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా విడుదలకు ముందు పుష్పరాజ్‌ పలు రికార్డ్స్‌ సొంతం చేసుకుంటున్నాడు. ప్రీసేల్‌ బిజినెస్‌లో సత్తా చాటిన పుష్ప ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్ల వ్యాపారం చేసిందని టాక్‌ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా 40 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement