‘ఆదికేశవ' ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాడు: దర్శకుడు

Director Srikanth Reddy Talks About Aadikeshava Movie - Sakshi

ఓ మంచి కథతో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు నా సన్నిహితులతో చెబితా..  మంచి కమర్షియల్ ఫిల్మ్‌ చేయమని సూచించారు. అప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాను.. అదే ఆదికేశవ.ఈ సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రం.. ఈ శుక్రవారం(నవంబర్‌ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. 

హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా లో చూస్తారు.

భీమ్లా నాయక్ సెట్స్ కి వెళ్ళి వంశీ గారికి  ఈ కథ చెప్పగా ఆయనకి నచ్చింది. ఆ తర్వాత చినబాబు గారికి, వైష్ణవ్  తేజ్ గారికి కథ చెప్పాను. అందరికీ నచ్చింది. అలా సితార సంస్థ తో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది .

ఏ రోజూ కూడా వంశీ గారు ఇంత బడ్జెట్ లో తీయమని నాకు చెప్పలేదు. కొత్త దర్శకుడివి నువ్వు, నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దని చెప్పారు. సినిమా కోసం నేను అడిగినవన్నీ సమకూర్చి పెట్టారు. మంచి మంచి నటీనటులను ఇచ్చారు. బడ్జెట్, పారితోషికం ఇలాంటి పట్టించుకోకుండా నా దృష్టి అంతా సినిమా చిత్రీకరణ మీద ఉండేలా చూశారు.

క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉందని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలి గారు కూడా చివరి 45 నిమిషాలు అదిరిపోయింది అన్నారు. డీఐ టైంలో ఈ సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ళు ఉన్నారు. సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది.

జి.వి. ప్రకాష్ గారి అనుభవం చాలా హెల్ప్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top