సుధీర్‌ బాబు ‘హంట్‌’ టైటిల్‌ మాది: హీరో నిక్షిత్‌ | Director Nikshit says that title is theirs | Sakshi
Sakshi News home page

సుధీర్‌ బాబు ‘హంట్‌’ టైటిల్‌ మాది: హీరో నిక్షిత్‌

Oct 18 2022 12:49 AM | Updated on Oct 18 2022 10:29 AM

Director Nikshit says that title is theirs - Sakshi

‘‘హంట్‌’ టైటిల్‌ని ముందు మేము రిజిస్టర్‌ చేయించాం. అయితే సుధీర్‌ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. టైటిల్‌ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్‌’ హీరో, దర్శకుడు నిక్షిత్‌ అన్నారు. నర్సింగ్‌ రావు నిర్మించిన చిత్రం ‘హంట్‌’. నిక్షిత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్‌ టీజర్‌ను విడుదల చేశారు.

ఎమ్‌ఎస్‌ఆర్ట్స్‌ అధినేత, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘హంట్‌’టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిల్మ్‌ చాంబర్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాం. ఇదే టైటిల్‌ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్‌ కూడా స్టార్ట్‌ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్‌’ ఆడియో రైట్స్‌ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్‌’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్‌ రావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement