Lingusamy Donates 10 Lakhs To CM Covid Relief Fund | డైరెక్టర్‌ లింగుస్వామి విరాళం - Sakshi
Sakshi News home page

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డైరెక్టర్‌ లింగుస్వామి విరాళం

Jun 2 2021 7:59 AM | Updated on Jun 2 2021 12:52 PM

Director Lingusamy Donates 10 Lakhs To CM Relief Fund - Sakshi

చెన్నై: కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే నటుడు రజనీకాంత్, శివకుమార్‌ కుటుంబం, అజిత్, విశాల్, దర్శకుడు శంకర్, వెట్రిమారన్‌ తదితరులు కరోనా నివారణ నిధికి విరాళాలు ఇచ్చారు. కాగా సోమవారం దర్శక, నిర్మాత లింగుస్వామి ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు చెక్కు అందించారు. దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న లింగుస్వామి ఇటీవల కరోనా రోగుల కోసం చెన్నైలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement