ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్‌ సి. ప్రేమ్‌కుమార్‌ | Director C. Prem Kumar Talk About Satyam Sundaram Movie | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్‌ సి. ప్రేమ్‌కుమార్‌

Sep 26 2024 9:20 AM | Updated on Sep 26 2024 10:59 AM

Director C. Prem Kumar Talk About Satyam Sundaram Movie

‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్‌ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్‌ సి. ప్రేమ్‌కుమార్‌ అన్నారు. 

కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్‌లాగానే రాశాను. కార్తీ, అరవింద్‌ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. 

కార్తీ, అరవింద్‌ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల  కెమిస్ట్రీ, కాంబినేషన్‌ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్‌. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్‌ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement