Producer Dil Raju Launched Suvarna Sundari Movie Digital Ticket - Sakshi
Sakshi News home page

‘సువర్ణ సుందరి'కి దిల్‌ రాజు సాయం

Jan 31 2023 4:47 PM | Updated on Jan 31 2023 5:56 PM

Dil Raju Launched Suvarna Sundari Movie Digital Ticket - Sakshi

సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ట్రైలర్, డిజిటల్ టికెట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. మంచి టెక్నికల్‌ వాల్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం మంచి అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు సురేంద్ర మాదారపు అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement