మా ఫ్యామిలీ నుంచి హీరో పరిచయం అవడం హ్యాపీగా ఉంది: దిల్‌ రాజు | Dil Raju Comments On Rowdy Boys Movie | Sakshi
Sakshi News home page

Rowdy Boys: మా ఫ్యామిలీ నుంచి హీరో పరిచయం అవడం హ్యాపీ.. దిల్‌ రాజు

Jan 8 2022 7:34 AM | Updated on Jan 8 2022 7:34 AM

Dil Raju Comments On Rowdy Boys Movie - Sakshi

యూత్‌ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం నిర్మించాం. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్‌ హీరోగా పరిచయమవుతుండటం హ్యాపీగా ఉంది. ఫుల్‌ ఎనర్జీతో ఆశిష్‌ చేసిన డాన్స్, నటన ఆకట్టుకుంటాయి..

ఆశిష్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనిత సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల చేస్తున్నారు.

‘దిల్‌’ రాజు, శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రౌడీ బాయ్స్‌’. యూత్‌ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం నిర్మించాం. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్‌ హీరోగా పరిచయమవుతుండటం హ్యాపీగా ఉంది. ఫుల్‌ ఎనర్జీతో ఆశిష్‌ చేసిన డాన్స్, నటన ఆకట్టుకుంటాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement