మంచి సినిమా చేశాం : దిల్‌ రాజు | Dil Raju about Balagam movie | Sakshi
Sakshi News home page

మంచి సినిమా చేశాం : దిల్‌ రాజు

Feb 27 2023 2:37 AM | Updated on Feb 27 2023 8:34 AM

Dil Raju about Balagam movie  - Sakshi

ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్ , శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న  రిలీజ్‌ కానుంది.

ఈ మూవీలోని ‘బలరామ నర్సయ్యో..’ అనే పాటను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ–‘‘చావు అనే అశుభ అంశాన్ని తీసుకుని శుభాలవైపు తీసుకువెళ్లే గొప్ప ప్రయోగమే ‘బలగం’’ అన్నారు. ‘‘బలగం’ చాలా మంచి సినిమా’’ అన్నారు ‘దిల్‌’ రాజు.‘‘మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు రావాలంటే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు ప్రియదర్శి. 

Advertisement
 
Advertisement
Advertisement