Dia Mirza says she never thought she would get best chances after 40 - Sakshi
Sakshi News home page

Dia Mirza: అలా వస్తాయని నేను ఎప్పుడూ అనుకోను: దియా మీర్జా

Apr 12 2023 11:35 AM | Updated on Apr 12 2023 11:49 AM

Dia Mirza says she never thought she would get best Chances after 40 - Sakshi

బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా దియా మీర్జా పరిచయం అక్కర్లేని పేరు.  మోడల్, నటి, నిర్మాతగా రాణించింది.  మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెలిచింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా.. దియా మీర్జా ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. రహ్నా హై తేరే దిల్ మే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ.. 'వయసు పెరిగేకొద్దీ అవకాశాలు వస్తాయని భావించట్లేదు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఉత్తమమైన పాత్రలు పోషిస్తానని నేను ఎప్పుడూ అనుకోను. యంగ్‌గా ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇది ఒక చిన్న జీవితమని గ్రహించాలి. కాలం ఎ‍ప్పుడు పరిగెడుతూనే ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.' అని అన్నారు.  

కాగా.. 2019లో నిర్మాత సాహిల్‌ సంఘాను దియా మీర్జా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఐదేళ్లకే విడాకులిచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ అబ్బాయి జన్మించారు. దియా చివరిసారిగా భీఢ్‌ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ధక్ ధక్‌ చిత్రంలో నటిస్తున్నారు.  తరుణ్ దూదేజా దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న షారుఖ్ ఖాన్-స్టార్ డుంకీలో దియా కనిపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement