
విశాఖపట్నంలో 'ఢీ-15' విన్నర్ లోకేష్‌పై అత్యాచార కేసు నమోదైంది. బుల్లితెరలో ప్రసారం అయ్యే డ్యాన్స్ షో 'ఢీ' ద్వారా లోకేష్ భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ.. విశాఖపట్నం పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై 64(1) 318 (2 )BNS సెక్షన్స్ కింద ద్వారక పోలీసులు కేసు నమోదు చేశారు. సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాధితురాలిపై లోకేష్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం జరిగిన 'ఢీ-15' డ్యాన్స్ షోలో 'టీమ్ S9' పేరుతో లోకేష్ పాల్గొన్నాడు. ఆ టీమ్‌లో అతనే ప్రధానంగా ఉండటంతో విజేతగా నిలిచినందుకు టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు.