Kangana Ranaut: భిన్నమైన లుక్స్‌లో కంగనా రనౌత్.. యాక్షన్ ప్యాక్‌డ్‌గా 'ధాకడ్' టీజర్

Dhaakad Teaser: Kangana Ranaut In 7 Fiery Looks: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తనదైన శైలీలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశంపైనైనా సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి భయం లేకుండా విమర్శలు సంధించి తాను కూడా వివాదాలపాలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతున్న 'లాకప్' షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తూనే సినిమాలతో బిజీగా ఉంది. కంగనా తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. రజ్‌నీష్ రజీ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీని దీపక్ ముకుత్, సోహెల్ మక్లాయ్ నిర్మించారు. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్ ఇచ్చింది కంగనా. 'ధాకడ్'ను మే 20నల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేసింది.
'యాక్షన్, స్టైల్, థ్రిల్. అన్ని ఒక్కరిలో ఉన్న ఏజెంట్ అగ్ని వచ్చేసింది.' అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో టీజర్‌ను షేర్ చేసింది. ఈ మూవీలో కంగనా రనౌత్ 'అగ్ని' అనే ఏజెంట్ పాత్రలో అలరించనుంది. టీజర్‌లో శత్రువుల రక్తం తాగే హార్డ్‌కోర్ ఏజెంట్‌గా కంగనా కనిపించింది. తాను చేసిన యాక్షన్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి. టీజర్‌లో కంగనా మొత్తంగా 7 విభిన్నమైన గెటప్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతోంది. 'నేను మణికర్ణికలో చేసిన యాక్షన్ సన్నివేశాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సినిమాల్లో హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ చేయడం చాలా అరుదు. ధాకడ్ మూవీ స్క్రిప్ట్ నా దగ్గరికొచ్చినప్పుడు ఒక కమర్షియల్ చిత్రంలో ఒక స్త్రీని యాక్షన్ హీరోయిన్‌గా చూపించడమనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.' అని కంగనా తెలిపింది.