నిజమైన మాంత్రికులతో సినిమా.. కథ కూడా అలాంటిదే | Sakshi
Sakshi News home page

నిజమైన మాంత్రికులతో సినిమా.. కథ కూడా అలాంటిదే

Published Sun, Feb 18 2024 10:35 AM

Devil Hunters Movie 2024 Release Details - Sakshi

దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు తదితర అంశాలతో ఈ మధ్య కాలంలో పలు సినిమాల వస్తూనే ఉన్నాయి. 'పొలిమేర 2', 'విరూపాక్ష' లాంటివి ఈ జానర్‌లోకే వస్తాయి. సరిగా తీయాలే గానీ వీటికి ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే నిజమైన మాంత్రికులతోనే సినిమా తీసి, విడుదలకు సిద్ధం చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?)

దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు గురించి పరిశోధించి తీసిన సినిమా 'డెవిల్‌ హంటర్స్'. రుద్రేశ్వర్‌ పతాకంపై ప్రజిత్‌ రవీంద్రన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మరణించిన వారి మూఢ నమ్మకాలని చర్చించే కథతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు హారర్ చిత్రాల్లో రానటువంటి ఎలిమెంట్స్‌తో దీన్ని తీశారట. 

25 ఏళ్లుగా తంత్ర శాస్త్రాలను నిర్వహిస్తున్న దర్శకనిర్మాత.. పలు యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఇందులో నటించిన వారందరూ మాంత్రికం చేయగలిగిన వారేనని చెప్పడం అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా నిజమైన మాంత్రికులతో సినిమా తీయడం ఏంట్రా బాబు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement