
దేవర సినిమా నుంచి జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు రెండో సాంగ్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‍తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.
దేవర సినిమా నుంచి రెండో పాట ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్‌లో తారక్ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారు. అందులో జాన్వీ కపూర్‌తో తారక్ ఉన్న ఫోటో తొలిసారి విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. దేవర ఫియర్ సాంగ్ విడుదలైన నుంచి ఈ చిత్రానికి భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రెండో పాటు విడుదల కానుంది. ఈ మెలోడీ సాంగ్‌కు ఏ రేంజ్‌లో ట్యూన్స్ ఉంటాయోనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
విడుదల విషయంపై క్లారిటీ
దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా పోస్టర్‌తో తేలిపోయింది. విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. కొత్త పోస్టర్‌లో సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Time for hearts to go full ❤️🔥
The most awaited #DevaraSecondSingle arriving on August 5th 🌊💕#DevaraonSep27th#Devara Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/aJXGD3uqUB— NTR Arts (@NTRArtsOfficial) August 2, 2024