కాలనీలో థ్రిల్‌ | Demonte Colony 2 Telugu dub to release on 23rd August | Sakshi
Sakshi News home page

కాలనీలో థ్రిల్‌

Aug 18 2024 12:49 AM | Updated on Aug 18 2024 12:49 AM

Demonte Colony 2 Telugu dub to release on 23rd August

అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్‌ ఆర్‌. జ్ఞానముత్తు దర్శకత్వంలో విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్‌సీ రాజ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజైంది. 

ఈ సినిమాని రాజ్‌ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌–శ్రీ బాలాజీ ఫిలింస్‌ తెలుగులో ఈ నెల 23న విడుదల చేస్తున్నాయి. ‘‘హారర్‌ థ్రిల్లర్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ చిత్రం రూపొందింది. ‘తంగలాన్‌’ వంటి పెద్ద సినిమాతో పాటు విడుదలైన మా ‘డీమాంటీ కాలనీ 2’ కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మేకర్స్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement