బీ గ్రేడ్‌ చిత్రాలతో కెరీర్‌ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా! | Deepshikha Nagpal: Doing B-Grade Films Damaged My Career | Sakshi
Sakshi News home page

చెత్త సినిమాలు చేశా.. అందరూ దూరం పెట్టారు, ఛాన్సుల్లేక..: బాలీవుడ్‌ నటి

Jun 8 2025 4:58 PM | Updated on Jun 8 2025 5:07 PM

Deepshikha Nagpal: Doing B-Grade Films Damaged My Career

దీప్శిఖ నగ్పాల్‌ (Deepshikha Nagpal).. కోయిల, బాద్‌షా, దిల్లగీ, పార్ట్‌నర్‌ వంటి బాలీవుడ్‌ (Bollywood) హిట్‌ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్‌ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్‌ కావాల్సి వచ్చిందంటోంది.

తప్పుడు నిర్ణయాలతో కెరీర్‌ తలకిందులు
ఇన్‌స్టంట్‌ బాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్‌ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్‌ రాజ్‌, సుభాష్‌ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్‌ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్‌ చేస్తుందంటే అది బీ గ్రేడ్‌ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్‌ చేసుకోవాలనేది అర్థం కాలేదు.

ఏదైనా పనే అనుకున్నా..
పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్‌ కాకుండా ఆగిపోయాయి.

(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్‌ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)

ఆ పోస్టర్‌ దెబ్బ కొట్టింది
కొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్‌ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్‌ గైడ్‌ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్‌ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్‌ చూశాక నేను బీ గ్రేడ్‌ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్‌ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.

ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్‌
పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్‌ పెట్టాను. ఇక్కడ సీరియల్స్‌, షోలు చేయడం స్టార్ట్‌ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్‌ పరి, రామాయణ్‌, కరిష్మా- ద మిరాకిల్స్‌ ఆఫ్‌ డెస్టినీ, బల్‌వీర్‌, మధుబాలా- ఏక్‌ ఇష్క్‌ ఏక్‌ జునూన్‌, సంతోషి మా వంటి పలు సీరియల్స్‌లో నెగెటివ్‌ పాత్రలు చేసింది.

చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి

Advertisement
 
Advertisement
Advertisement