ఆ రెండు సినిమాలతో ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ కి సంబంధమే లేదు: దీపక్‌ సరోజ్‌ | Child Actor Deepak Saroj Interesting Comments About His Upcoming Siddharth Roy Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Deepak Saroj: ఆ రెండు సినిమాలతో ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ కి సంబంధమే లేదు

Published Wed, Feb 21 2024 1:23 PM

Deepak Saroj Talk About Siddharth Roy Movie - Sakshi

‘‘సిద్ధార్థ్‌ రాయ్‌’లో నా లుక్‌ చూసి ‘అర్జున్‌ రెడ్డి’, ‘యానిమల్‌’ సినిమాల్లా ఉంటుందేమో అనిపించవచ్చు.. కానీ, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ కథకీ, ఆ చిత్రకథలకీ ఏ విషయంలోనూ పోలిక లేదు’’ అన్నారు దీపక్‌ సరోజ్‌. బాలనటుడు దీపక్‌ సరోజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’. వి. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన్వీ నేగి హీరోయిన్‌. జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా దీపక్‌ సరోజ్‌ మాట్లాడుతూ– ‘‘బాల నటుడిగా ‘మిణుగురులు’లో నా పాత్రకి  నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి, ఫ్యామిలీ బిజినెస్‌లోకి వచ్చాను. యశస్విగారు చెప్పిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. నా ప్రతిభను చూపించే అవకాశం ఈ మూవీ రూపంలో దొరికింది. నా పాత్రను ఒక సవాల్‌గా తీసుకుని చేశాను. ప్రస్తుతం రెండు కొత్త చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement