సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ కీలక నిర్ణయం!

Dedicated to movies says Murali Mohan - Sakshi

– మురళీమోహన్‌

‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1973 మార్చిలో నా సినిమా (‘జగమే మాయ’) షూటింగ్‌ మొదలైంది. నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు నా కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు మురళీమోహన్‌. చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను.

తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్‌ని. చనిపోయేంతవరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్‌గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను’’ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్‌ చేశారు మురళీమోహన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top