Dasara Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Dasara Twitter Review: నాని ‘దసరా’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Mar 30 2023 7:07 AM | Updated on Mar 30 2023 8:50 AM

Dasara Movie Twitter Review In Telugu - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘దసరా’ మూవీ ఎట్టకేలకు విడుదలైంది.  శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.  కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘దసరా’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు.

‘దసరా’కి ట్విటర్‌లో పాజిటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. నాని కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చాడని చెబుతున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అదిరిపోయిందట. ఇక శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వానికి నెటిజన్స్‌ ఫుల్‌ మార్కులు ఇస్తున్నారు. 

నాని అన్న మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు.. రూ.100 కోట్లు లోడింగ్ అంటూ చిన్న వీడియోను పోస్ట్ చేశారు.

ఈ దశాబ్దంలోనే బెస్ట్ మూవీ. డైరెక్టర్‌లో అద్భుతమైన స్టఫ్ ఉంది. అయితే సినిమా స్లోగా ఉంది. నాని, కీర్తి నటనతో ది బెస్ట్ అనిపించారు. ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌  కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ నాని తనదైన స్టైల్ లో నడిపించాడు. కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది’అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement