Dasara Movie Director Srikanth Odela Gets Married - Sakshi
Sakshi News home page

Srikanth Odela: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్‌, ఫోటో వైరల్‌

May 31 2023 9:09 PM | Updated on Jun 1 2023 9:27 AM

Dasara Director Srikanth Odela Wedding Held in Karimnagar - Sakshi

దసరా హీరో నాని కూడా ఈ పెళ్లికి రావాలని అనుకున్నప్పటికీ తన అప్‌కమింగ్‌ సినిమా షూటింగ్‌ పూణెలో జరుగుతుండటంతో శ్రీకాంత్‌ వివాహానికి హాజరు కాలేకపోయాడు. అటు కీర్తి సు

దసరాతో తెలుగు వెండితెరపై బ్లాక్‌బస్టర్‌ డెబ్యూ ఇచ్చిన యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం (మే 31న) ఆయన వివాహం కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖనిలో ఘనంగా జరిగింది. ఈ దర్శకుడి పెళ్లికి ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. దసరా హీరో నాని కూడా ఈ పెళ్లికి రావాలని అనుకున్నప్పటికీ తన అప్‌కమింగ్‌ సినిమా షూటింగ్‌ పూణెలో జరుగుతుండటంతో శ్రీకాంత్‌ వివాహానికి హాజరు కాలేకపోయాడు. అటు కీర్తి సురేశ్‌ కూడా బిజీగా ఉండటంతో డైరెక్టర్‌ పెళ్లికి రానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పెళ్లి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం ఎంతటి సెన్సేషనల్‌ విజయం అందుకుందో తెలిసిందే! నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ నాని కెరీర్‌లోనే అత్యధికంగా రూ.100 కోట్లు రాబట్టింది. దీంతో శ్రీకాంత్‌ నెక్స్ట్‌ సినిమా ఎవరితో తీస్తాడు? ఎలాంటి జానర్‌లో తెరకెక్కించనున్నాడు? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చదవండి: గుంటూరు కారం ఎట్లా ఉంటాదో తెలుసా? అయితే ఈ టీజర్‌ చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement