'Das Ka Dhamki' Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Dhamki Twitter Review: విశ్వక్‌ సేన్‌ సినిమాకి అలాంటి టాక్‌.. ‘ధమ్కీ’ ఎలా

Mar 22 2023 8:36 AM | Updated on Mar 22 2023 10:25 AM

Das Ka Dhamki Movie Twitter Review In Telugu - Sakshi

డైనమిక్ హీరో విశ్వక్ నటింటి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్‌. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది.  దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ధమ్కీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్‌ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

ఈ సినిమా ఫస్టాఫ్‌ బాగుందని అంటున్నారు. సినిమా మొత్తం ఎక్కడో చూసినట్లు అనిపించినా.. కొంచెం కొత్తగానే ఉంటుందట. విశ్వక్‌ డ్యూయెల్‌ రోల్‌ బాగా వర్కౌట్‌ అయిందని కామెంట్‌ చేస్తున్నారు.

 సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు కొన్ని ఇబ్బందిపెడుతున్నాయని అంటున్నారు. అంతే కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్టాప్‌లో పెద్దగా ట్విస్టులు లేవు కానీ సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు ఉన్నాయట. అయితే ఇవన్ని గత సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయట.  'సెకెండాఫ్‌లో విశ్వక్ సేన్ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే, ఎన్నో ట్విస్టులను పెట్టాడు. అయితే, ఇవన్నీ గతంలో చూసినట్లే అనిపిస్తాయి. ఫలక్‌నామా దాస్ దర్శకుడి నుంచి మరింతగా ఆశించాను. మొత్తం మీద బిలో ఏవరేజ్ సినిమా' అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement