సీఎం ఆగ్రహం.. బుక్ మై షో నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్! | Sakshi
Sakshi News home page

Book My Show: సీఎం ఆగ్రహం.. బుక్ మై షో నిర్వాహకులపై కేసు నమోదు!

Published Mon, Dec 25 2023 2:39 PM

Cyberabad CP Warns To Book My Show Representatives About Sun Burn Show - Sakshi

సన్‌ బర్న్‌ షోకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్ బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. 

సీఎం రేవంత్ ఆదేశాలతో సన్ బర్న్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ మహంతి వెల్లడించారు. అనుమతి కోసం కూడా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. బుక్‌ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సీపీ తెలిపారు. అనుమతుల్లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సంఘటనపై బుక్‌ మై షోతో పాటు సన్ బర్న్ షో నిర్వాహకులపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు సన్ బర్న్ షోకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement