జక్కన్న భారీ స్కెచ్.. ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా మహేశ్ మూవీ

బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిల్మ్ స్థాయిని పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తర్వాత గ్రాఫిక్స్ లేకుండా తీసిన ఆర్ ఆర్ ఆర్ అంతకు మించి వర్క్ అవుట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ.1100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో రాజమౌళి కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. అందుకే ఈ సారి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
(చదవండి: ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.600 కోట్లు.. ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడంటే?)
మహేశ్ బాబు హీరోగా తెరకెక్కే చిత్రాన్ని పూర్తిగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడని సమాచారం. అందుకోసం భారీ బడ్జెట్ డిమాండ్ చేస్తున్నాడు. బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో ఈసారి రాజమౌళి మరో విజువల్ వండర్ ను తెరకెక్కించబోతున్నాడట.రజనీకాంత్ హీరోగా శంకర్ మేకింగ్ లో వచ్చిన 2.0 ఇండియాలోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ మూవీ బడ్జెట్ 550 కోట్లు పైనే ఉంది.ఇప్పుడు ఈ మూవీ రికార్డ్ ను మహేశ్, రాజమౌళి సినిమా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మహేశ్ బాబు సినిమాకు సంబంధించి ఇంకా స్టోరీ సెట్ కాలేదని సమాచారం. అయితే ఏ స్కేల్లో ఈ మూవీ ఉండాలి, ఏ స్కేల్లో తెరకెక్కితే ఎంత తిరిగి రాబట్టవచ్చు అనేది ప్రస్తుతం రాజమౌళి లెక్కలు వేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఉండబోతుందట. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను అందుకుంటూనే ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసే విధంగా సినిమా ఉండాలని రాజమౌళి కోరుకుంటున్నాడు. 2023 ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.