కంగనా విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు | CPI Leader Narayana Slams On Kangana Ranaut Over Comments On Real freedom | Sakshi
Sakshi News home page

kangana Ranaut: కంగనా విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ

Nov 11 2021 7:50 PM | Updated on Nov 11 2021 8:55 PM

CPI Leader Narayana Slams On Kangana Ranaut Over Comments On Real freedom - Sakshi

వివాదస్పద నటి కంగనా రనౌత్‌పై సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విలాసవంతమైన బిక్షగత్తే ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్న నటి కంగనా రనౌత్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెకు స్వాతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలియదు. ఆ బిరుదు ఇచ్చిన బీజేపీకి అస్సలు  తెలియదంటూ ఆయన మండిపడ్డారు.

చదవండి: Kangana Ranaut: వివాదాస్పద వ్యాఖ్యల దుమారం, ఫిర్యాదు

1945లో వచ్చిన స్వాతంత్య్రం బిక్ష అని అసలు స్వాతంత్య్రం బీజేపీ వచ్చిన తరువాత 2014లో వచ్చిందని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇంతకంటే బానిసత్వం ఏం ఉంటుందని,  నువ్వు అడుక్కోవాలి అనుకుంటే అడుక్కో ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. నీకు బిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్య్ర పోరాటంతో పోలుస్తావా? స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడే అర్హ‌త నీకు, నీకు ప‌ద్మ‌శ్రీ ఇచ్చిన ఆ ప్ర‌భుత్వానికి కూడా అర్హ‌త లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. కంగనా కుష్టి రోగికంటే మించిన రోగిష్టి అంటూ విమర్శలు గుప్పించారు.

చదవండి: బోల్డ్‌ సీన్స్‌పై ప్రశ్నించిన రిపోర్టర్‌, పెళ్లి తర్వాత మీరేం చేస్తారన్న హీరోయిన్‌

ఆమె వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, స‌మాజానికి ఆమె క్ష‌మాప‌ణ చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. లేక‌పోతే పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ఖాయమని హెచ్చరించారు. కాగా కంగనా ఓ ఇంటర్వ్యూలో 1947లో స్వాతంత్య్రం రాలేదు అది బిక్షమాత్రమే. కాంగ్రెస్‌ హయాంలో బ్రిటీష్‌ పాలన కొనసాగిందని, 2014లో దేశానికి నిజమైన స్వాతంత్య్రం వ‌చ్చిందని పేర్కొంది. దీంతో వివాదం చెలరేగింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే  బీజేపీ ఏంపీ వరుణ్‌ గాంధీ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement