స్టార్‌ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్‌ హీరోయిన్‌పై ఫిర్యాదు | Complaint Against Digangana Suryavanshi for Trying to Extort Money from Showstopper Producers | Sakshi
Sakshi News home page

డబ్బు తీసుకుని మోసం చేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. పైగా బెదిరింపులు!

Published Mon, Jun 10 2024 12:31 PM | Last Updated on Mon, Jun 10 2024 12:39 PM

Complaint Against Digangana Suryavanshi for Trying to Extort Money from Showstopper Producers

షో స్టాపర్‌.. ఈ సిరీస్‌ ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ మధ్య ఈ సిరీస్‌ను అటకెక్కించారని ప్రచారం జరిగితే అదంతా అబద్ధమని దర్శకనిర్మాత మనీశ్‌ హరిశంకర్‌ పేర్కొన్నాడు. డబ్బింగ్‌ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నాడు. జీనత్‌ అమన్‌, జరీనా వాహబ్‌, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్‌ రాజ్‌ జైన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ప్రగల్భాలు పలికి..
ఈ క్రమంలో హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీపై నిర్మాత మనీశ్‌ హరిశంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. షో స్టాపర్‌ ప్రాజెక్ట్‌ కోసం హీరో అక్షయ్‌ కుమార్‌తో పాటు అతడి నిర్మాణ కంపెనీని ఈ సిరీస్‌ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగన ప్రగల్భాలు పలికింది. తనకు అక్షయ్‌ కుమార్‌, షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌తో పరిచయాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేస్తానని నమ్మించింది. 

పెద్దమొత్తంలో డబ్బు గుంజి
అలా అక్షయ్‌ కుమార్‌ను రప్పిస్తానని చెప్పి తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరకు మోసం చేసిందని ఎమ్‌హెచ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ ఆరోపిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరిశంకర్‌ను బెదిరించిందని అతడి అడ్వకేట్‌ ఫాల్గుని బ్రాహ్మభట్‌ తెలిపారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోయిందని, పేమెంట్స్‌ ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి తమ బ్యానర్‌ ప్రతిష్ట దిగజార్చారంటూ నటుడు రాకేశ్‌ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్‌ డిజైనర్‌ కృష్ణన్‌ పార్మర్‌పైనా నిర్మాత పరువు నష్టం దావా వేశారు. కాగా దిగంగన తెలుగులో హిప్పి, వలయం, సిటీమార్‌, క్రేజీఫెలో వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

చదవండి: ప్రియుడితో సినీ నటి ప్లాన్‌.. స్నేహితురాలిని బర్త్‌డే పార్టీకి పిలిచి ఆపై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement